మనతెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణవాసులు ఇష్టపడే సిఎంఆర్ స్వర్ణ, వస్త్ర షాపింగ్‌మాల్‌ను మంచిర్యాల పట్టణంలో శుక్రవారం మహానటి కీర్తిసురేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధునిక జీవన శైలికి అవసరమైన వస్త్రాలతో పాటు అన్నివర్గాల అభిరుచులకు అనుగుణంగా స్వర్ణ అభరణాలు సిఎంఆర్ షాపింగ్ మాల్‌లో ఉంటాయన్నారు. నాణ్యమైన ఫ్యాషన్ ఉత్పత్తులు, నవ్యశైలిలో రూపొందించిన అభరణాలను తయారీ ధరలకే సిఎంఆర్ అందిస్తుందన్నారు. మంచిర్యాలలో 45వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల భవనంలో సిఎంఆర్ స్వర్ణ, వస్త్ర షాపింగ్‌మాల్‌ను ఏర్పాటు చేశారు. సమీప జిల్లాలకు ఇదే భారీ షాపింగ్ మాల్ కావడం విశేషం. హైదరాబాద్‌కు వెళ్లి షాపింగ్ చేయాల్సిన అవసరం లేకుండా అన్ని హంగులతో అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని అందిస్తోంది. 916 హాల్‌మార్క్ బంగారు ఆభరణాలను తయారీ ధరలకే అందించడంతో పాటు కుటుంబసభ్యులందరికి కావల్సిన వస్త్రాలు హోల్‌సేల్ ధరలకే విక్రయిస్తున్నామని సంస్థ అధినేత అల్లక సత్యనారాయణ తెలిపారు. సంస్థలో దాదాపు 350 మందికి ఉపాధిని కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.