Monday, December 23, 2024

సిఎంఆర్ వేగవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:జిల్లాలోని మిల్లర్లు సీఏంఆర్ కింద బియ్యాన్ని వేగవంతంగా డెలివరీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం హాలియాలోని వజ్రతేజ, దివ్యశ్రీ, నిడమనూరులోని హరికృష్ణ తదితర మిల్లులను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఖరీఫ్ కింద మిల్లర్లు 62 శాతం డెలివరీ చేశారని ఇంకను 1, 13,004 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించాలన్నారు.

అదే యాసంగిలో ఇప్పటి వరకు 8 శాతం బియ్యాన్ని డెలివరీ చేసినట్లు తెలిపారు. 4,34,088 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించాల్సి ఉందన్నారు. జిల్లాలోని మిల్లర్లు ప్రతి రోజు 100 నుంచి 150 ఏసీకెల బియ్యాన్ని అందిండానికి సిద్ధంగా ఉన్నారని అయితే ఎఫ్‌సీఐ వద్ద దిగుమతుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దిగుమతి కావడానికి రెండు, మూడు రోజుల సమయం పడుతుందని మిల్లర్స్ అధ్యక్షులు చిట్టిపోలు యాదగిరి అదనపు కలెకటర్‌కు విన్నవించారు.

త్వరితంగా దిగుమతి అయ్యే విధంగా చూడాలని, అదనపు గోదాంలు తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. వారి వెంట ఏఎస్‌వో వెంకటేశ్వర్లు, డీఎం నాగేశ్వర్‌రావు, మిల్లర్స్ కార్యదర్శి పేలపూడి బాలకృష్ణ, కుక్కడపు రమేష్, రంజిత్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News