సియంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఇల్లందు : సమాజంలోని అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో వుండాలన్నదే సిఎం కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా హరిసింగ్‌నాయక్ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయం నందు నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరయిన 66లక్షల 57400 రూపాయల సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను 215మంది లబ్దిదారులకు శుక్రవారం ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు అభివృద్దిపథంలో ముందంజలో వున్నారన్నారు. ప్రజారోగ్యమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ఆపదలో వున్నవారికి ఆపన్నహస్తంగా అనారోగ్యానికి గురయి ఆర్థికస్తోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు అండగా సియం సహాయనిధి సిఎంఆర్‌ఎఫ్ ఆర్థిక భరోసా కలిగిస్తుందన్నారు.
పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ ఎల్లపుడూ అండగా వుంటుందని, కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ అధిష్టానం కృషిచేస్తుందన్నారు. రాష్ట్రంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను వివిధ రాష్ట్రాలలో అమలు చేసేందుకు ఆయా రాష్ట్రాలు సిద్దమవుతుండడం కెసిఆర్ పాలనాతీరుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాగ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీఛైర్మన్ బానోత్ హరిసింగ్‌నాయక్, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ జానీపాషా, జడ్పీటిసి వాంకుడోత్ ఉమాదేవి, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు శీలంరమేష్, ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, ఆత్మ కమిటీఛైర్మన్ భావ్‌సింగ్‌నాయక్, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.