Monday, December 23, 2024

మెరుగైన వైద్యం కోసం సీఎంఆర్‌ఎఫ్

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: నిరుపేదలకు మెరుగైన వైద్యం కోసం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన సౌమ్యకి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా నిమ్స్ ఆసుపత్రిలో రూ.1.25 లక్షల విలువగల ఎల్‌ఓసీని ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సుభిక్షంగా ఉండాలనే కాంక్షతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఆదునిక వైద్యం అందించడం కోసం జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలతో కూడిన తెలంగాణ మెడికల్ హబ్‌ను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News