Wednesday, January 22, 2025

అభాగ్యులకు సిఎంఆర్‌ఎఫ్ అండ

- Advertisement -
- Advertisement -

సంగెం: అభాగ్యులకు సిఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుకొండ, సంగెం మండలాలతోపాటు గ్రేటర్ వరంగల్‌కు చెందిన 66 మంది లబ్ధిదారులకు ఆదివారం హన్మకొండలోని నివాసంలో 22,29,500 విలువచేసే సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలు వైద్యం కోసం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఎల్‌ఓసీ, సిఎం రిలీఫ్ ఫండ్ అందిస్తూ అండగా ఉంటుందన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ వరమన్నారు.

ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతూ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. సిఎంఆర్‌ఎఫ్ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందచేస్తున్నామన్నారు. సిఎం కెసిఆర్ పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను రూపొందించి అమలుచేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు.

ఈ కార్యక్రమంలో సంగెం, గీసుకొండ జడ్పీటీసీలు గూడ సుదర్శన్‌రెడ్డి, పోలీసు ధర్మారావు, వరంగల్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సాగర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారంగపాణి, 17వ డివిజన్ కార్పోరేటర్ గద్దె బాబు, ప్రసాద్, నరేందర్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్, కిషోర్‌యాదవ్, సుదర్శన్, దొనికెల శ్రీనివాస్, కుమారస్వామి, మురళితోపాటు రెండు మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News