Thursday, January 23, 2025

పేదలకు సిఎంఆర్‌ఎఫ్ ఓ వరం

- Advertisement -
- Advertisement -

మల్హర్: పేదవారు అనారోగ్యానికి గురైనప్పుడు ఆసుపత్రి ఖర్చులతో ఆర్థికపరమైన కష్లాల్లో పడకూడవద్దనే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందజేయడం జరుగుతుందని జెడ్‌పి చైర్మెన్ పుట్టమధు అన్నారు. మండలంలోని రుద్రారం గ్రామంలో బుధవారం సిఎంఆర్‌ఎప్ నిధుల నుండి మంజూరైన చెక్కులను లబ్ధ్దిదారులకు అందించారు. జాడి లక్ష్మికి మంజూరైన రూ.34 వేల చెక్కుతో పాటు తదితరులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా పార్టీలతో సంబంధం లేకుండా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ప్రతివారికి అందిస్తున్నదని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు రాఘవరెడ్డి, సర్పంచి పగడాల ధనలక్ష్మి నారాయణ, ఉప సర్పంచ్ బుడిగ వెంకటేష్, వాల యాదగిరిరావు, అక్కినవేని సుమన్, వెంకట్రాజం, రాజబాబు, లచ్చయ్య, సంపత్‌లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News