Friday, December 27, 2024

అనారోగ్య బాధితులకు వరం సిఎంఆర్‌ఎఫ్

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: పేద అనారోగ్య బాధితులకు సిఎం సహాయ నిధి ఒక వరమని, కార్పొరేట్ వైద్యం చేయించుకున్న వారికి ఆర్థిక ఇబ్బందులను సిఎంఆర్‌ఎఫ్ ద్వారా తొలగించడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిల్లో చికిత్స పొందిన 20 మంది లబ్ధిదారులకు 8లక్షల 75వేల 5వందల రూపాయల విలువజేసే సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చందర్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండదం నియోజక వర్గంలో ఇప్పటి వరకు సిఎంఆర్‌ఎఫ్ కింద సుమారు 13 కోట్ల రూపాయల వరకు చెక్కుల రూపేనా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. సిఎం కెసిఆర్ 9 ఏళ్ల పాలనలో ఏదో ఒక పథకం ద్వారా ప్రతీ ఒక్కరూ లబ్ధి పొందారని అన్నారు.

పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయయి వైద్యాన్ని అందించడానికి జిల్లా కేంద్రాలకే పరిమితమైన మెడికల్ కళాశాలను గోదావరిఖనిలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 330 పడకలతో, అధునాతన సౌకర్యాలతో, అన్ని విభాగాల ప్రత్యేక వైద్య నిపుణులు 24 గంటలు సేవలందిస్తున్నారని అన్నారు. ఈ సేవలను అవసరమైన ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.

కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, జడ్పిటిసి ఆముల నారాయణ, కార్పొరేటర్లు ఇంజపురి పులేందర్, వైస్ ఎంపిపి మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి, సర్పంచ్‌లు ధరణి రాజేష్, గుమ్ముల రవీందర్, బాదరవేణి స్వామి, నాయకులు నీల గణేష్, కాల్వ శ్రీనివాస్, మల్లయ్య, విజయ్, కుమార్, రాజేష్, సాగర్, పిల్లి రమేష్, వీరాలాల్, పీచర శ్రీనివాస్, బస్వరాజ్ గంగరాజు, ఇరుగురాళ్ల శ్రావణ్, మేకల అబ్బాస్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News