Monday, January 27, 2025

నిరుపేదలకు వరం సిఎంఆర్‌ఎఫ్

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్ ః ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరంలా మారిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. పెంట్లవెల్లి మండల పరిధిలోని జటప్రోల్ గ్రామానికి చెందిన ఈ.బుగ్గన్న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మెరుగైన వైద్యం కోసం తమ పరిస్థితిని ఎమ్మెల్యే బీరం హర్సవర్ధన్ రెడ్డి దృస్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి సిఎంఆర్‌ఎఫ్ పథకం నుంచి లక్ష రూపాయల ఎల్‌ఓసిని మంజూరు చేయించి బుధవారం బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు సిఎం కెసిఆర్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News