- మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా రెడ్డి
నర్సాపూర్: వివిధ అనారోగ్యా కారణాలతో చికిత్స అనంతరం, సిఎంఆర్‌ఎఫ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్, సునీతా లక్ష్మారెడ్డి సిఫార్సు మేరకు ధరకాస్తు చేసుకొగా మంజూరైన లబ్ధిదారులకు, నర్సాపూర్ క్యాంపు కార్యాలయంలో, అచ్చంపేట, సిరిపుర, జక్కపల్లీ, గంగారం, నాగ్ సాన్ పల్లీ, నర్సాపూర్ గ్రామాలకు చెందిన వారికి మొత్తం నాలుగు లక్షల రూపాయల చెక్కులను, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, పేదరికంలో ఉండి అతి కష్టం మీద వైద్యం చేయించుకున్న, చేయించుకుంటున్న వారికి, ఆర్థిక సహాయంతో భరోసా అందించేందుకు, సిఎం కెసిఆర్ కల్పించిన మంచి పథకమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో, కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందిస్తున్నారని, అత్యవసర సందర్భాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేయించుకున్న పేదలకు, ప్రభుత్వం చేదోడుగా ఉండాలని సిఎంఆర్‌ఎఫ్‌ను కల్పించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన త ర్వాత సిఎం కెసిఆర్ పేదల బతుకులు మార్చాలన్న ఆలోచనతో అనేక సం క్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సునీతా లకా్ష్మరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యం గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, జగన్, పెంటయ్య తదితరులున్నారు