Thursday, January 23, 2025

సిఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం లాంటిది

- Advertisement -
- Advertisement -

శ్రీరంగాపురం : ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేద ప్రజల వైద్య సహాయం కోసం వరంగా మారిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శ్రీరంగాపురం మండల కేంద్రానికి చెందిన కురుమన్న కుమార్తె తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

ఈ విషయాన్ని బిఆర్‌ఎస్ నాయకుడు నరేష్ నాయుడు మంత్రి దృష్టికి తీసుకుపోగా స్పందించిన మంత్రి చిన్నారి మెరుగైన వైద్య సహాయం కోసం 5 లక్షల రూపాయాల ఎల్‌ఓసిని మంజూరు చేయించి సోమవారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News