Wednesday, January 22, 2025

అభాగ్యులకు భరోసా సిఎంఆర్‌ఎఫ్

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : పేద ప్రజలకు, అభాగ్యులకు భరోసాగా, వరప్రదాయినిగా సిఎం రిలీఫ్ ఫండ్ పనిచేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. పదర మండల కేంద్రానికి చెందిన కొయ్యుల భవాని అనారోగ్యానికి గురై బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సహకారంతో సిఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం సిఎం సహాయ నిధి నుంచి బాధితుడికి మంజూరైన లక్షా 50 వేల రూపాయల చెక్కును హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మంది నిరుపేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని, సిఎం రిలీఫ్ ఫండ్ పేదల ప్రాణాలకు భరోసాగా నిలిచిందని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకుని సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రాణాలతో జీవిస్తున్నారని గుర్తు చేశారు. అలాగే ప్రమాదంలో గాయపడ్డ వారు, అనారోగ్యంతో కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకున్న వారు సిఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, తద్వారా సిఎం రిలీఫ్ ఫండ్ అవకాశాన్ని అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News