Friday, November 22, 2024

ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సిఎం లక్షం

- Advertisement -
- Advertisement -
  • చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

పరిగి: ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్షంగా ముఖ్యమంత్రి కేసిఆర్ కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని మాధారం గ్రామ పంచాయతీలో బుదవారం చెవెళ్ల ఆరోగ్య రథం కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ బోయిని రాములు ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనందరం ఆరోగ్యాన్ని ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తామో అప్పుడు మళ్లీ ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నించిన ఫలితం లేదని అన్నారు. అందుకు ప్రతి కటుంబం ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కంటి, మోకాలు, బీపి, షుగర్ వంటి వాటిని పరీక్షలు చేయించు కోవాలన్నారు. చేవెళ్లలో ఉచితంగా పరీక్షలు చేయిస్తామన్నారు. ఇటీవల ఆలూర్‌లో నిర్వహించామన్నారు.

కష్టాలను కొని తెచ్చుకోవద్దని ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో అందరం బాగుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటికిపైగా కేసిఆర్ కంటి వెలుగు పరీక్షలు చేయించారని గుర్తు చేశారు. మన గ్రామంలో ఉచితంగా నిర్వహించే ఈలాంటి వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని అన్నారు. ఏలాంటి సమస్య ఉన్న ప్రాథమిక స్థాయిలోనే చూపించుకోవాలన్నారు. ఎంత సంపద ఉన్న ఆరోగ్యం లేకుంటే శూన్యం అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు.

కేసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకవచ్చిందన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అందుతుందన్నారు. మాధారంతో పాటు చుట్టు పక్కల ఉన్న గ్రామాలలో ఏ సమస్యలు ఉన్న మాదృష్టికి తీసుకరావాలన్నారు. పరిగిలో డయాలాసిస్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పల్లెలో పల్లె దవాఖానాలు వచ్చాయన్నారు. ఎంపి సొంతంగా తన ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయించడం సంతోషకరమన్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కోటి మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయించి 50 వేల మందికి ఉచిత అద్దాలను అందించామన్నారు. అనంతరం కర పత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపిపి కరణం అరవింద్‌రావు, స్థానిక సర్పంచ్ రాములు, సీనియర్ నాయకుడు ప్రవీణ్‌రెడ్డి, మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సొసైటీ వైస్ ఛైర్మన్ భాస్కర్, సర్పంచ్‌లు మహాలింగం, మధుసూదన్‌రెడ్డి, విజయ్‌నాయక్, నర్సింహ్మా, బిఆర్‌ఎస్ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు టి.మధుసూదన్, మాజీ సర్పంచ్ గోపాల్, పార్టీ అధ్యక్షుడు మహేందర్, రేషన్ డీలర్ వీరారెడ్డి, సాయిరాం, సిహెచ్ నర్సింహ్మా, శ్రీనివాస్, ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News