Monday, December 23, 2024

రైతును రాజు చేయడమే సిఎం లక్షం

- Advertisement -
- Advertisement -

వీణవంక:మూడు పంటలకు సాగు నీరందించేందుకు నిరంతర విద్యుత్ సరఫరా చేసే సీఎం కేసీఆర్ కావాల్నా మూడు గంటల విద్యుత్ సరఫరా చేస్తామంటున్న కాంగ్రెస్ కావాల్నా లేక మతమంటలకు ఆజ్యం పోసే బీజేపీ కావాల్నా అనేది రైతులు ఆలోచించాలని ఎమ్మెల్సీ, మండలి విప్, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు.

విద్యుత్ సరఫరాపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలో రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను విద్యుత్ తీగలకు తగిలించి ఆ బొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్‌రెడ్డి, రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు దిష్టిబొమ్మపై పడి బోరున ఏడుస్తూ సోమవారం తగులపెట్టారు.

అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ రైతును రాజులా బతికేలా చేయడమే లక్షంగా సీఎం కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం చూస్తోందని, దాన్ని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు నిత్యం దుమ్మెత్తి పోస్తున్నారని మండిపడ్డారు. రైతులు చర్చించుకునేందుకే రైతు వేదికలు ప్రభుత్వం నిర్మించిందని రైతులందరు ఈ విషయంపై రైతు వేదికలతో పాటు గ్రామంలోని ముఖ్యమైన కూడళ్లలో చర్చ పెట్టాలని కోరారు.

కాంగ్రెస్, బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలకు ఎవరూ లొంగొద్దని సూచించారు. రైతుల కోసమే బీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎంపీపీ ముసిపట్ల రేణుక – తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల – సాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయ్‌భాస్కర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత – శ్రీనివాస్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News