Monday, December 23, 2024

అన్ని మతాల అభివృద్ధికి సిఎం కృషి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: హిందూ ధర్మ పరిరక్షణ, అన్ని మతాల అభివృద్దే ధ్యేయంగా ప్రతి మతాన్ని గౌరవిస్తూ సిఎం కెసిఆర్ అభివృద్ధి చేస్తున్నారని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని 19వ వార్డులో గల మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఎంఎల్‌ఎ సంజయ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం వార్డులో సిసి రోడ్లు, పలు అభివృద్ధి పనులను పరిశీలించి, ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ గతంలో కంటే 5 రెట్ల నిధులతో పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. జగిత్యాల పట్టణంలో అన్ని ఆలయాలకు, మజిద్‌లకు నిధులు మంజూరు చేయడం ఒక చ రిత్ర అన్నారు. రూ.18 కోట్లతో మంచినీళ్ల బావి నుంచి చల్‌గల్ బ్లాక్ స్పాట్ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉన్నారని, గతంలో 20 మంది వైద్యులు ఉంటే నేడు 120 మంది వైద్యులు అందుబాటులో ఉన్నారని, సిటి స్కాన్, రేడియాలజీ ల్యాబ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు.

ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు ఉపయోగించుకోవాలని, ఆసరా పెన్షన్‌లు, కళ్యాణలక్ష్మి, బీడీ పెన్షన్ నిరుపేదలకు వరమని, దేశంలో ఎక్కడా ఇలాంటి పథకాలు అమలు కావట్లేదని అన్నారు. జగిత్యాలకు తెలంగాణ రాష్ట్రం ద్వారా 1000 కోట్లపైన నిధులు అభివృద్ధి, సంక్షేమానికి మంజూరు చేయడం జరిగిందన్నారు. జగిత్యాల పట్టణంలో 14 జోన్‌లలో 120 సర్వే నంబర్‌లను జోన్‌ల మార్పు చేయడం జరిగిందన్నారు.

రూ.300 కోట్లతో 4500 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్ట డం జరిగిందని, 200 కోట్లతో మెడికల్ కాలేజి పనులు జరుగుతున్నాయని, రూ.11 కోట్లతో మెడికల్ కళాశాల చుట్టూ రోడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో పట్టణంలో రూ.36 కోట్లతో 18 ట్యాంక్‌లు నిర్మాణం, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌లు ముస్కు నారాయణరెడ్డి, క్యాదాసు నవీన్, కూతురు రాజేష్, చుక్క నవీన్, బొడ్ల జగదీష్, శివ కేసరి బాబు, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, రంగు మహేష్, రామకృష్ణ, బండారి రాజ్‌కుమార్, కూతురు శేఖర్, రాజన్న, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ అలిశెట్టి వేణు, పట్టణ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి శరత్‌రావు, డిఇ రాజేశ్వర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News