గాంధీభవన్‌లో సిఎం చిత్రపటానికి చేనేత విభాగం పాలాభిషేకం
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ హండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టి)ని మంజూరు చేయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం పాలాభిషేకం చేసింది. గూడూరు శ్రీనివాస్ నేత ఆదేశానుసారం సోమవారం గాంధీభవన్‌లో రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు మసున రవికుమార్ నేత అధ్యక్షతన పున్న రామలింగం నేత, పీర్ల పురుషోత్తం నేత, జనరల్ సెక్రటరీ అంకం శ్రీనివాస్ నేత, మచ్చ వరలక్ష్మి నేత, సెక్రటరీ సత్యసాయి బాబు నేత, , సంగారెడ్డి అధ్యక్షుడు బాలె ప్రవీణ్ నేత, దత్తాత్రేయ నగర్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ ఎలె నరేందర్ నేత, మసున అశోక్ నేత, కర్నాటి లింగయ్య నేత, వంశీ,ప్రణిత్ తదితరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రముఖ సంస్థ రాష్ట్రానికి మంజూరు కావడం ద్వారా తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే టెక్స్ టైల్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన కోర్సులను చదవడానికి వీలుగా ఉంటుందని ఈ సందర్భంగా నాయకుల పేర్కొన్నారు.