Monday, January 20, 2025

గాంధీభవన్‌కు ముఖ్యమంత్రుల పొగ కమ్మేసింది:  బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రుల పొగ గాంధీ భవన్‌ను కమ్మేసిందని, ఫలితాల తరువాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బకరా అవుతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాడని ఒకరిద్దరు మాట్లాడితే తాను సిఎం కానని వ్యాఖ్యానించారు.

గంగుల కమలాకర్‌రావుకు సిఎం కెసిఆర్ ఇంకా బి-ఫామ్ ఇవ్వలేదని విమర్శించారు. బిఆర్‌ఎస్ ఎక్కువ సంఖ్యలో బిసిలకు 23 సీట్లు ఇచ్చిందని, కాంగ్రెస్ 19 సీట్లే ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బిసిలకు వ్యతిరేకమని మండిపడ్డారు. బిసిలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. క్షుద్ర పూజలు చేయడమే కాదు అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను కూడా చూడాలని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News