కోల్‌కతా: అత్యంత తీవ్రస్థాయి అంశం కొవిడ్‌పై భేటీకి పిలుస్తారు కానీ తమను మాట్లాడనివ్వరు, చెప్పేది వినకుండా అవమానిస్తారు.. ఇదేం పద్థతి అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విమర్శించారు. గురువారం ప్రధాని మోడీ జిల్లా కలెక్టర్లతో సిఎంల సమక్షంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ దశలో తాము మాట్లాడేందుకు ప్రధాని అవకాశం ఇవ్వలేదని మమత ఆరోపించారు. ప్రధాని అభద్రతా భావానికి గురవుతున్నారని, అందుకే తమను మాట్లాడన్విడం లేదని మమత ఆరోపించారు. ప్రధాని సమీక్ష సమావేశం తరువాత మమత విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోడీ సిఎంలు చెప్పేది వినడం లేదని రాష్ట్రాల సాధకబాధకాలు తెలిసేది ఎలా? అని ఇటీవల జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోరెన్ బాటలోనే ఇప్పుడు మమత తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక విషయాలు ఉన్నాయి. బ్లాక్‌ఫంగస్, టీకాల విషయాలు వంటివి తాను ప్రస్తావించాలనుకున్నానని, అయితే ఇందుకు అవకాశం ఇవ్వలేదని మమత తెలిపారు. అయితే తన మాటలను ప్రధాని అడ్డుకున్నది లేనిదీ తెలియచేయలేదు. అయితే ప్రధాని మోడీ సమీక్షలలో ఎప్పుడూ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పడం, ఇదే క్రమంలో కేసులు పెరగడం జరుగుతోందని, ఇప్పుడు జిల్లా అధికారులతో సమీక్ష మొక్కుబడిగా నిర్వహించారని మమత తెలిపారు. తాము మాట్లాడేందుకు అవకాశం లేనప్పుడు ఎందుకు పిలిచినట్లు, ఈ విధంగా చూస్తే ఈ భేటీ విఫల భేటీనే అన్నారు.
అడ్డుకోవడం ఆమె నైజం: రవిశంకర
అత్యంత కీలక సమావేశ ప్రక్రియను అడ్డుకోవడానికి మమత యత్నించారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. మమత ఈ విధంగా సమీక్షలకు అడ్డుతగలడం ఇది తొలిసారి కాదని ఇంతకు ముందు పలు సార్లు ఈ విధంగా వ్యవహించారని విమర్శించారు. కొవిడ్‌పై పోరులో జిల్లా కలెక్టర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు? తీసుకోవల్సిన చర్యలు? కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందాల్సి ఉంది? వంటి అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో ప్రధాని సదుద్ధేశంతో భేటీ నిర్వహించారని, దీనికి మమత అడ్డుతగిలేందుకు యత్నాంచారని, జిల్లా అధికారులతో ప్రధాని మాట్లాడటం తప్పా? దీనికి మమత తన ప్రశ్నలతో దారిమళ్లించాలని చూడటం తప్పా? అని ప్రశ్నించారు.
CMs not allowed to speak in PM video conference: Mamata