Saturday, December 21, 2024

సిఎం సహాయ నిధి పేదలకు వరం

- Advertisement -
- Advertisement -

తెలకపల్లి : రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజల మెరుగైన వైద్యాని కి సిఎం సహాయ నిధి పథకం వరంలా మారిందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం తెలకపల్లి మండలంలోని పర్వతపూర్ గ్రామానికి చెందిన ఎస్. కాశన్న మెరుగైన వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 2 లక్షల 50 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బిజినేపల్లి… మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను బుధవార ం ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు అందజేశా రు. మండల పరిధిలోని సాయిన్‌పల్లి గ్రామానికి బాలచంద్రమ్మకు లక్ష రూపాయలు, వట్టెం గ్రామానికి చెందిన మనీషకు లక్ష రూపాయలు, మల్కాపూర్‌కు చెందిన బి. చంద్రయ్యకు లక్ష రూపాయల ఎల్‌ఓసి లెటర్లను ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఆపద సమయంలో ఆదుకున్న ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి ఎల్లప్పు డు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News