Wednesday, January 22, 2025

ఆపదలో ఉన్నవారికి సిఎం సహాయనిధి ఒక వరం

- Advertisement -
- Advertisement -
  • చెక్కుల పంపిణీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి

శివ్వంపేట: ఆపదలో ఉన్న పేదలకు సిఎం సహాయనిధి వరం లాంటిదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేట మండలం గోమరం గ్రామానికి చెందిన బాలకృష్ణకు చెందిన కుటుంబ సభ్యులకు సిఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా సిఎం సహాయనిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సిఎంఆర్‌ఎఫ్ పథకం ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నదని అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News