Friday, December 20, 2024

సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సిఎంలు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు యాదాద్రి నుంచి హెలీకాప్టర్లలో ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
సిఎం కెసిఆర్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ గురించి జాతీయ నేతలకు సిఎం కెసిఆర్ వివరించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను జాతీయ నేతలు తిలకించారు. సిఎం కెసిఆర్ కలెక్టరేట్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలు నేతలకు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News