Sunday, December 22, 2024

మే నెలలో సిఎన్‌జి, పిఎన్‌జి ధరలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల ముగియనుంది. రేపటి నుంచి మే నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల మొదటి తేదీన అనేక మార్పులు ఉంటాయి. మే 1 నుంచి కూడా చాలా మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు నేరుగా వినియోగదారుల జేబుపై ప్రభావం చూపనున్నాయి. ప్రభుత్వం అనేక నియమాలను మార్చబోతోంది. ఇందులో జిఎస్‌టి నియమాలు వంటివి ఉన్నాయి.

సిఎన్‌జి, పిఎన్‌జి ధరలు
సిఎన్‌జి, పిఎన్‌జి ధరలు ప్రతి నెల మొదటి తేదీ లేదా మొదటి వారంలో సవరిస్తారు. ఢిల్లీ, ముంబైలలో నెల మొదటి వారంలో పెట్రోలియం కంపెనీలు గ్యాస్ ధరను మారుస్తాయి. మే ప్రారంభంలో సిఎన్‌జి ధరలలో మార్పు ఉండవచ్చు. ఏప్రిల్‌లో ముంబై, ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో సిఎన్‌జి, పిఎన్‌జి ధరలు తగ్గించారు. కొత్త ధరలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో కూడా సిఎన్‌జి ధరను తగ్గించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News