Monday, January 20, 2025

ఎక్కువ మైలేజీ ఇచ్చే CNG కార్లు..

- Advertisement -
- Advertisement -

దేశంలో CNG కార్ల అమ్మకాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఎవరైనా సరే ప్రతిరోజూ పని నిమిత్తం కొరకు సుమారు 30 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణించే వారికి CNG కార్లు చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. పెట్రోల్ తో నడుస్తున్న కార్లతో పోలిస్తే.. CNG కార్ల ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు తక్కువ ధరలో ఉండే CNG కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే..ఇక్కడ కొన్ని బెస్ట్ ఒప్షన్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

టాటా టియాగో iCNG

టాటా టియాగో సిఎన్‌జి బలమైన కారు. మీరు దీనిని పెట్రోల్, CNG రెండింటిలోనూ కొనుగోలు చేయవచ్చు. ఇందులో 1.2 లీటర్ ఇంజన్ ఉంది. ఇది CNG మోడ్‌లో 73hp పవర్, అంతేకాకుండా 95Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇంజన్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఉపయోగించారు. ఈ కారు కిలోకు 26.49కిమీ మైలేజీని అందిస్తుంది. కాగా, కారు ధర రూ.6.64 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS

తర్వాతి స్థానంలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారు ఉంది. దీని ధర కాస్త ఎక్కువే కానీ ఇందులో లభించే సౌకర్యం మరే హ్యాచ్ బ్యాక్ కారులో కూడా ఉండదు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ (కప్పా డ్యూయల్ వీటీవీటీ) ఉంది. ఈ కారు CNG మోడ్‌లో 27 km/kg మైలేజీని అందిస్తుంది. కాగా, దీని ధర రూ.7.68 లక్షల నుంచి మొదలవుతుంది.

మారుతీ సుజుకి వ్యాగన్-R CNG

మారతి కారు మైలేజ్ కి పెట్టింది పేరు. అందులో మారుతీ సుజుకి వ్యాగన్-ఆర్ ఒకటి. ఈ కారులో 1.0లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ కారు CNGలో కూడా అందుబాటులో ఉంది. అయితే, 34.43 km/kg మైలేజీని ఇస్తుంది. భద్రత కోసం..కారులో EBD, ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అయితే, కారు ధర రూ.6.44 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మారుతి ఆల్టో K10 CNG

మారుతి సుజుకి ఆల్టో కె10 చిన్న కుటుంబానికి మంచి కారు అని చెప్పవచ్చు. ఈ కారులో శక్తివంతమైన 1.0లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ కారు CNGలో కూడా అందుబాటులో ఉంది. కాగా, 33.85 km/kg మైలేజీని ఇస్తుంది. భద్రత కోసం..కారులో EBD, ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. దీని ధర రూ.5.96 లక్షల నుంచి మొదలవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News