- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరావ్యాపితం చేసి తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఆచార్య డా. సినారే వర్థంతి సందర్భంగా సిఎం కెసిఆర్ నివాళులర్పించారు. కవిగా, రచయితగా, గేయ కావ్యకృతి కర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా సినీ గీతాల రచయితగా తనదైన ప్రత్యేక శైలిలో తెలంగాణ పద సోయగాలను ఒలికిస్తూ సాహితీ ప్రస్తానాన్ని కొనసాగించిన సృజనకారుడు సినారె అని ప్రశంసించారు. తెలంగాణకు జ్ఞానపీఠ్ అవార్డును అందించిన సాహితీవేత్త సినారె అని కెసిఆర్ పొగిడారు. గంగా-జమునా తెహజీబ్‌కు సినారె సాహితీ చిరునామా అని ప్రశంసించారు. భాషా సాహిత్యం నిలిచి ఉన్నన్నాళ్లు సినారె ప్రజల హృదయాల్లో ఉంటారన్నారు.
- Advertisement -