Thursday, January 23, 2025

బిల్డింగ్‌పై నుంచి పడి కోడైరెక్టర్ మృతి

- Advertisement -
- Advertisement -

Co Director dead felt from building

మనతెలంగాణ, సిటిబ్యూరో: ప్రమాదవశాత్తు నాలుగు అంతస్థుల భవనంపై నుంచి పడి ఓ కోడైరెక్టర్ మృతిచెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….సినిమా ఇండస్ట్రీలో రమేష్ కో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. కృష్ణానగర్‌లోని గణపతి కాంప్లెక్స్ సమీపంలోని నాలుగు అంతస్థుల బిల్డింగ్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి తాను ఉంటున్న నాలుగో అంతస్థు నుంచి ప్రమాదవశాత్తు కిందపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News