Friday, December 20, 2024

సిద్దమైతున్న కోచింగ్ సెంటర్లు….

- Advertisement -
- Advertisement -

ఉద్యోగాల నోటిఫికేషన్‌తో నిర్వహకులు ఏర్పాట్లు వేగం
నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు ఎత్తుకుపై ఎత్తులు
సీనియర్ల ఫ్యాకల్టీలు ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం
వారం రోజుల నుంచి కిక్కిరిసిపోతున్న పలు గ్రంథాలయాలు

Coaching centers ready for Jobs notification

మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తామని ప్రకటన చేయడంతో ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నిర్వహకులు పెద్ద ఎత్తున నిరుద్యోగులను చేర్చుకుని సంపాదించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కరోనా మొదటి వేవ్ నుంచి తాళాలు వేసి పలు కోచింగ్ సెంటర్లు గత వారం రోజుల నుంచి రంగులు వేస్తూ సిబ్బందిని నియమించుకునే పనిలో పడ్డారు. ఫ్యాకల్టీలకు ఆఫర్లు ఇస్తూ ఈసారి తమ కేంద్రంలో బోధించాలని కోరుతున్నారు. మహానగరంలో సుమారుగా 230 వరకు కోచింగ్ సెంటర్లు ఉన్నట్లు, ఆర్టీసీ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్, చిక్కడపల్లి, కూకట్‌పల్లి, అమీర్‌పేట, దిల్‌షుక్‌నగర్, ఉప్పల్, తార్నాక, నల్లకుంట, విద్యానగర్ వంటి ప్రాంతాల్లో కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేస్తూ నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు ప్రచారంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా సీనియర్ అధ్యాపకులచే బోధన చేస్తామని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు 91,142 ఖాళీలుండగా వాటిలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తుండగా, 80వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ నేడో రేపో రానుంది.

ఈఉద్యోగాలకు 10లక్షల మంది పోటీ పడుతున్నారని అధికారులు భావిస్తున్నారు. మరోపక్క కోచింగ్‌కు వెళ్లలేనివారు ప్రిపేర్ అయ్యేందుకు మెటరియల్ కూడా సిద్దం చేసి పుస్తకాలను ప్రింటింగ్‌కు అర్డర్ ఇస్తున్నారు. గ్రూపు 1కు రూ. 70వేలు, గ్రూపు 4కు రూ. 25వేల వరకు నిర్ణయించినట్లు కోచింగ్ సెంటర్ల నిర్వహకులు పేర్కొంటున్నారు. వారం రోజుల నుంచి గ్రంథాలయాలు కూడా యువకులతో కిటకిటలాడుతున్నారు. నగరంలో ఉన్న పెద్ద లైబ్రరీ అఫ్జల్‌గంజ్‌లో ఉండటంతో రోజుకు వందలాది మంది నిరుద్యోగుల వెళ్లి కావాల్సిన బుక్స్ తీసుకుని గంటల తరబడి చదువుతున్నారు. చిక్కడపల్లి లైబ్రరీ కూడా సందడిగా మారిందని నిర్వహకులు చెబుతున్నారు. కోచింగ్ సెంటర్లు ఉన్న ప్రాంతాల్లో రూ. 5 బోజనంకు గిరాకీ పెరిగింది, మధ్యాహ్నం వేళ గంట పాటు క్యూ లైన్ కనిపిస్తుంది. ఈబోజనం పేద, మధ్యతరగతి ప్రజల ఆకలి తీర్చుతుందని బోజనం చేస్తున్న పలువురు పేర్కొంటున్నారు.

కోచింగ్ సెంటర్ల ఫీజులను నియంత్రించాలి: విద్యార్థి సంఘాలు

నగరంలో పలు కోచింగ్ సెంటర్ల నిర్వహకులు సిండికేట్‌గా మారిన ఫీజులు ఇష్టానుసారంగా పెంచుతున్నారని విద్యార్థిసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రూ. 70వేల నుంచి 25వేల వరకు వసూలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేద విద్యార్థులకు గ్రంథాలయాలే దిక్కుగా మారాయంటున్నారు. అడ్డగోలుగా నిరుద్యోగులను పీడించి వసూలు చేసే కోచింగ్ సెంటర్లపై అధికారులు నిఘా పెట్టాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News