Monday, December 23, 2024

జూన్ 1 నుంచి గురుకులం ఉపాధ్యాయుల కోచింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జూన్ 1 నుండి రాష్ట్రంలోని 12 బిసి స్టడీ సర్కిల్‌లలో గురుకులం ఉపాధ్యాయుల కోచింగ్ కార్యక్రమం నిర్వహించబడుతుందని టిఎస్ బిసి స్టడీ సర్కిల్ ఢైరెక్టర్ కె. అలోక్ కుమార్ తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 12 నుండి 25వ తేదీలోగా www.tsbcstudycircle.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తల్లిదండ్రుల వార్షికాదాయం సంవత్సరానికి రూ. 5 లక్షల లోపు ఉండాలన్నారు.

అభ్యర్థుల ఎంపిక విధానం డిగ్రీ/బిఎడ్ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ సూచించిన విధంగా, రిజర్వేషన్ ప్రకారం ఉంటుందన్నారు. అమలులో ఉన్న నిబంధనల ప్రకారం స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందించబడుతుందని తెలిపారు. మరింత సమాచారం కోసం ఫోన్ 04024071178, 04027077929 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News