కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన సంబంధిత శాఖపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు దేశంలో కొత్త గనులను వేలం వేసేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అప్పట్లో ఒక్కో నగరంలో గనుల వేలం నిర్వహించిన ప్రభుత్వం మొట్టమొదటి సారిగా ఈనెల 21న హైదరాబాద్ కేంద్రంగా వేలం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వేలంపాటకు రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను హాజరు కావాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ సమాచారం అందచేసింది. కేంద్రం వేలానికి పెట్టిన గనుల్లో సింగరేణి సమీపంలోని శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఉంది. అయితే అక్కడ 11.99 కోట్ల టన్నుల బొగ్గు గనుల నిల్వలు ఉన్నట్లుత భూ గర్భ సర్వేలో తేలింది. దీంతో ఈ గనిని ఎలాగైనా దక్కించుకునేందుకు సింగరేణి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో తొలిసారి గనుల వేలంలో ఆ సంస్థ పాల్గొంటోంది.