Tuesday, January 21, 2025

బొగ్గు ఉత్పత్తి పెంచాలి: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశంలో విద్యుత్ లేకుండా ఏ పనీ కాదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోడీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఢిల్లీ శాస్త్రి భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పిత్తి జరుగుతోందని, విద్యుత్ కోతలు లేకుండా ఉండాలంటే బొగ్గు ఉత్పత్తి పెంచాలన్నారు. మనం ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నామని, రానున్న రోజుల్లో దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుదామని, ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నారు.

తెలంగాణ భవన్‌ బయట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి వందనం సమర్పించారు. ఆ తర్వాత.. అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లికూడా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్‎తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గురువారం కిషన్ రెడ్డి బంగ్లా సాహిబ్ గురుద్వారాను దర్శించుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News