Monday, January 20, 2025

బొగ్గు ఉత్పత్తి రవాణాలో ముందుండాలి

- Advertisement -
- Advertisement -

రోజుకు 2.35 లక్షల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి రవాణా జరపాలి
ఈ మాసాంతానికి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 700 లక్షల టన్నులను అధిగమించాలి
అన్ని ఏరియాల జీఎంలతో సింగరేణి సిఎండి బలరాం సమీక్ష
మూడేళ్ల తర్వాత ఏరియాల జీఏం లతో ప్రత్యక్ష సమావేశం

మన తెలంగాణ / హైదరాబాద్ : ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి నెల అయిన మార్చిలో రోజుకు కనీసం 2.35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అదే పరిమాణంలో బొగ్గు రవాణా జరపాలని , తద్వారా ఈ మాసాంతానికి 700 లక్షల టన్నుల వార్షిక లక్ష్యాన్ని అధిగమించాలని సింగరేణి సిఎండి ఎన్. బలరాం కోరారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో ఆయన సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ల తో ఉత్పత్తిపై ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. కరోనా కారణంగా గత మూడేళ్లుగా కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్న ఈ సమీక్ష సమావేశాలను, ఈసారి కొత్త చైర్మన్ ఆధ్వర్యం లో ఏరియా జీఎం లను హైదరాబాద్‌కు పిలిపించి ప్రత్యక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ప్రతి ఏరియా జనరల్ మేనేజర్ తో సునిశిత సమీక్షను నిర్వహించారు. ఆ ఏరియాలో లక్ష్యాల సాధనకు గల ఇబ్బందులను డైరెక్టర్ల సమక్షంలో చర్చించి తక్షణ పరిష్కార మార్గాలు సూచించారు. ఈ ఏడాదికి నిర్దేశించుకున్న 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని , రవాణాను సాధించడానికి ప్రతి ఏరియా జిఎం తన కింది అధికారుల తొను,ఓవర్ బర్డెన్ యజమానులతో సమీక్షిస్తూ, సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఆర్థిక సంవత్సరంలోఇది చివరి నెల అయినందువల్ల ప్రతిరోజు ప్రతి షిఫ్ట్ ఎంతో విలువైందని సిఎండి బలరాం పేర్కొన్నారు. తాను, సంస్థ డైరెక్టర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటామని , బొగ్గు ఉత్పత్తి రవాణాకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు,అవాంతరాలు లేకుండా సాఫీగా సాగేలా చూడాలని కోరారు. మొత్తం 12 ఏరియాల్లో మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు ,బెల్లంపల్లి ఏరియాలు లక్ష్యాలు అధిగమించి ముందుకు పోవడంపై ఆయన అభినందనలు తెలియజేస్తూ ఇతర ఏరియాలు కూడా తమ వంతు కృషి చేసి వార్షిక లక్ష్యాలు సాధించాలని పిలుపునిచ్చారు.

గత యేడాదికన్నా భేష్ !
గత ఏడాది ఇదే మార్చ్ కాలంతో పోల్చి చూసినట్లయితే సింగరేణి సంస్థ చాలా మెరుగైనవృద్ధిని కనపరిచిందని సిఎండి బలరాం అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి 601 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా ఈ ఏడాది 4.3 శాతం వృద్ధితో ఫిబ్రవరి చివరి నాటికి 627 లక్షల టన్నుల ఉత్పత్తి చేశామని, అలాగే గత ఆర్థిక సంవత్సరం 600 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపగా ఈ ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధితో ఇప్పటివరకు 631 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిపామన్నారు. ఓవర్ బర్డెన్ తొలగింపులో గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 371 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించగా ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి చివరి నాటికి 2.7 శాతం వృద్ధితో 381 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించడం జరిగిందన్నారు. కాగా ఈ సమీక్ష సమావేశంలో సంస్థ డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి సత్యనారాయణ రావు, డైరెక్టర్ (ఆపరేషన్స్ పర్సనల్) ఎన్ వి కె శ్రీనివాస్, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ ) జి .వెంకటేశ్వర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్) జే .ఆల్విన్ జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) ఎం సురేష్ జనరల్ మేనేజర్ (సి పి పి) జె. సురేష్, జనరల్ మేనేజర్ (ఎన్విరాన్మెంట్ ) జేవియల్ గణపతి, జనరల్ మేనేజర్, (మార్కెటింగ్) దేవేందర్, జనరల్ మేనేజర్ (పి పి) సాయిబాబా, జనరల్ మేనేజర్ (ఓసి మైన్స్) డివిఎస్ సూర్యనారాయణ రాజు, జనరల్ మేనేజర్ (సిహెచ్ పి స్) సిహెచ్ నవీన్ కుమార్ ఇంకా కార్పొరేట్ నుంచి వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News