- Advertisement -
కొత్తగూడెం: భారీ వర్షాలు కురుస్తుండడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కోయగూడెం ఉపరితల గని ప్రాంతంలో నిన్న(మంగళవారం) 28 మి.మీ వర్షపాతం పడింది. భారీ వానలతో ఇల్లెందు, కోయగూడెం ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మణుగూరు ఓసి గనుల్లో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
ఇక, పెద్దపల్లి జాల్లాలోని రామగుండంలో 4 ఉపరితల గనుల్లోకి వర్షపు నీరు చేరుకోవడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచినపోయింది. దీంతో అధికారులు మోటర్ల సహాయంతో నీటిని బయటకు పంపుతున్నారు.
- Advertisement -