పాకిస్తాన్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ప్రకటించిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో చివరకు దిగివచ్చారు. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ తో పొత్తుకు అంగీకరించారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వానికి మార్గం క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. ఇరు పార్టీల అగ్రనేతలు శుక్రవారం రాత్రి లాహోర్ లో భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుకు కలసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ ఎవరికి వారే విజయం తమదేనని ప్రకటించుకోవడంతో మొదట కొంత సందిగ్ధత ఏర్పడింది. నవాజ్ షరీఫ్ పార్టీ 30 సీట్లలో వెనుకబడి ఉన్నప్పటికీ, తనదే విజయమని ప్రకటించుకున్న మూర్ఖుడు నవాజ్ షరీఫ్ అని ఇమ్రాన్ ఖాన్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఇమ్రాన్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రసంగాన్ని పిటిఐ నేతలు విడుదల చేశారు.