Sunday, December 22, 2024

తెలంగాణలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది: మాజీ మంత్రి ఈటెల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మాజీ మంత్రి,బిజెపి నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఈ సారి హంగ్ రావచ్చని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

తమ పార్టీ ఈ సారి తెలంగాణలో 25 నుండి 30 గెలిచే ఛాన్స్ ఉందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వంలో బిజెపికి కింగ్ మేకర్ కాబోతుందన్నారు. కానీ బిఆర్‌ఎస్‌తో కలిసే జత కట్టమని తేల్చి చెప్పారు. తెలంగాణలో హంగ్ ఏర్పడవచ్చని ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News