పోర్బందర్(గుజరాత్): గుజరాత్‌లోని పోర్బందర్ నగరంలో భారత తీర రక్షక దళం హెలికాప్టర్ ఆదివారం మధ్యాహ్నం 12.10 గంటలకు కూలిపోయింది. ఇది అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్. రొటీన్ సార్టీలు పూర్తి చేసుకుని తిరిగొచ్చిన ఈ హెలికాప్టర్ పోర్బందర్‌లోని తీర రక్షక ఎయిర్‌పోర్ట్‌లో దిగుతుండగా కూలిపోయిందని పోర్బందర్ పోలీస్ సూపరింటెండెంట్ భగీరథ్‌సిన్హా జడేజా తెలిపారు. రన్‌వేపై కూలిపోగానే హెలికాప్టర్ నిప్పంటుకుంది. తర్వాత అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చింది. హెలికాప్టర్‌లోని ముగ్గురు సిబ్బందిని బయటికి తెచ్చి హాస్పిటల్‌కు తరలించారు. వారు బాగా కాలిపోయారని పోలీస్ సూపరింటెండెంట్ అన్నారు. ‘ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే ఇద్దరు ప్రాణాలు వదిలారు, మరొకరు ఆసుపత్రిలో చనిపోయారు’ అని కమలా బాగ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్ కన్మియా తెలిపారు. ఆ సిబ్బంది ఐడెంటిటీలు ఇంకా నిర్ధారించలేదని కూడా వివరించారు. గత ఏడాది సెప్టెంబర్ 2న అరేబియా సముద్రంలో ఏఎల్‌హెచ్ ఎంకె3 హెలికాప్టర్ కూలిపోయిన నాలుగు నెలల తర్వాత ఈ తాజా దుర్ఘటన జరిగింది.
గుజరాత్‌లో కూలిన తీర రక్షక దళం హెలికాప్టర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -