Monday, December 23, 2024

టేకాఫ్ తరువాత కూలిన కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్

- Advertisement -
- Advertisement -

కొచ్చి : కేరళ లోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కోస్ట్‌గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ టేకాఫ్ అయిన తరువాత కూలిపోయింది. ఈ సంఘటనలో ఒకరు గాయపడ్డారు. ఇది చాపర్ శిక్షణ విమానం. ఆదివారం మధ్యాహ్నం 12.55 గంటల సమయంలో టేకాఫ్ అయిన తరువాత అదుపు తప్పి కుప్ప కూలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఒక వ్యక్తి చేయికి స్వల్ప గాయం అయింది. దీంతో విమానాశ్రయం లోని ఆపరేషన్స్ రెండు గంటలసేపు ఆపేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆ హెలికాప్టర్‌ను అక్కడ నుంచి తొలగించడంతో రన్‌వే పూర్తిగా ఖాళీ అయింది. తరువాత విమాన సర్వీస్‌లు మొదలయ్యాయి. ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News