- Advertisement -
చెన్నై : పాక్ జలసంధిలో అకస్మాత్తుగా పడవకు పగుళ్లు వచ్చి ప్రమాదంలో పడ్డ పది మంది మత్సకారులను తీర రక్షక దళం రక్షించగలిగింది. నాగపట్నం లోని నవూరు హార్బర్ నుంచి ఈనెల 5న చేపల వేటకు ఈ మత్సకారులు బయలుదేరారు. అదే రోజు రాత్రి అకస్మాత్తుగా వీరి పడవకు పగుళ్లు వచ్చాయి. పడవ లోకి నీళ్లు ప్రవేశించి ఇంజిన్ పనిచేయకపోవడంతో పడవను అదుపు చేయడం వీలు కాలేదు. శుక్రవారం తెల్లవారు జామున ఈ సమాచారం రామేశ్వరం లోని రాష్ట్ర మత్సశాఖ విభాగం నుంచి మండపం లోని తీర రక్షక సిబ్బందికి చేరింది. వెంటనే ఐసిజిఎస్ సి432 అనే కోస్ట్‌గార్డ్ షిప్ బయలుదేరి పాక్ జలసంధిలో పంబన్ ఈశాన్య ప్రాంతంలో విపత్తులో చిక్కుకున్న పదిమంది మత్సకారులను రక్షించ గలిగింది. పగిలిపోయిన పడవను ఒడ్డుకు చేర్చగలిగారు. రామేశ్వరం లోని పంబన్ ఫిషింగ్ హార్బర్‌కు పడవతోపాటు మత్సకార్మికులను అప్పగించారు.
- Advertisement -