Sunday, December 22, 2024

మధురైలో అత్యాధునిక సస్టెయినబిలిటీ కేంద్రాన్ని ప్రారంభించిన కోట్స్‌..

- Advertisement -
- Advertisement -

అప్పెరల్‌, ఫుట్‌వేర్‌ కోసం దారాలు, నిర్మాణాత్మక విడిభాగాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైన కోట్స్‌, అధికారికంగా తమ నూతన, అత్యాధునిక సస్టెయినబిలిటీ కేంద్రాన్ని తెరిచింది. మధురైలోని స్పిన్నింగ్‌, ట్విస్టింగ్‌ పైలెట్‌ ప్లాంట్‌ వద్ద దీనిని ఏర్పాటుచేశారు.

మధురైలోని ఈ నూతన సస్టెయినబిలిటీ కేంద్రం, చైనాలోని షెన్‌జెన్‌లోని కోట్స్‌ సస్టెయినబిలిటీ కేంద్రానికి అనుగుణంగా ఉండటంతో పాటుగా రీసైకిల్డ్‌, పునరుత్పాదక మెటీరియల్స్‌ దిశగా మారడాన్ని కూడా వేగవంతం చేయనుంది. ఈ రెండు కేంద్రాలూ సంయుక్తంగా కలిసి పనిచేయడంతో పాటుగా అప్పెరల్‌, ఫుట్‌వేర్‌, పెర్‌ఫార్మెన్స్‌ మెటీరియల్స్‌ కోసం సస్టెయినబల్‌ స్యూవింగ్‌ థ్రెడ్స్‌ను ఆవిష్కరించనున్నాయి.

మధురైలోని ఈ సస్టెయినబిలిటీ హబ్‌, పరిశ్రమలో సస్టెయినబిలిటీని సృష్టించడంలో వినియోగదారులు, ఇతర వాటాదారులకు మద్దతు అందించనుంది. రాబోయే ఐదు సంవత్సరాలలో హరిత సాంకేతికతలను, మెటీరియల్స్‌ను అభివృద్ది చేయడం కోసం 10 మిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టడం ద్వారా తమ సస్టెయినబిలిటీ లక్ష్యాలను చేరుకోవాలనే కోట్స్‌ లక్ష్యంలో ఇది భాగం. గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాజీవ్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘ కోట్స్‌లో స్పిన్నింగ్‌, ట్విస్టింగ్‌ కోసం మధురైలో ఈ అత్యాధునిక కేంద్రం ప్రారంభిస్తున్నామని వెల్లడించేందుకు సంతోషిస్తున్నాము.నెట్‌ జీరోకు మేము కట్టుబడి ఉన్నాము’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News