Sunday, January 19, 2025

మాట నిలుపుకున్న రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నయాకుడు రాహుల్ గాంధీ నుంచి సుల్తాన్‌పూర్ చర్మకారుడు రాం చేత్ సోమవారం చెప్పుల తయారీకి సంబంధించిన ముడి పదార్థాలను అందుకున్నారు. జులై 26న రాహుల్ గాంధీ సందర్శనతో దేశవ్యాప్తంగా చాం చేత్ పేరు మార్మోగింది. పరవునష్టం కేసులో సుల్తాన్‌పూర్ కోర్టుకు హాజరై లక్నోకు తిరిగివెళుతూ రోడ్డు పక్కన ఉన్న రాం చేత్ చెప్పుల దుకాణాన్ని

రాహుల్ గాంధీ సందర్శించి అతని మంచిచెడ్డలను వాకబు చేశారు. అతని జీవనస్థితిగతులను మారుస్తానని రాహుల్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తర్వాత చెప్పుకు కుట్టేందుకు ఉపయోగపడే కుట్టు మిషన్‌ను అందచేసిన రాహుల్ ఇప్పుడు తాజాగా చెప్పుల తయారీకి సంబంధించిన ముడి సరుకును పంపించారు. రాహుల్ పంపించిన చర్మ పదార్థాలతో స్త్రీ, పురుషుల కోసం షూస్ తయారుచేస్తానని రా చేత్ తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్‌కు అతను కృతజ్ఞతలు తెలియచేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News