Sunday, December 22, 2024

బెడ్‌షీట్‌లో దూరిన నాగుపాము

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్: నిద్రిస్తున్న వ్యక్తి బెడ్‌షీట్‌లో పాము దూరిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని సిరోజామ్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి తన మంచంపై నాగుపాము కనిపించడంతో షాక్‌తో మేల్కొన్నాడు. వివరాల్లోకి వెళితే వ్యక్తి తన నివాసంలో నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి అతని బెడ్‌షీట్‌లోకి నాగుపాము ప్రవేశించింది. తెల్లవారుజామున, పాముల శబ్దాలు విన్న అతను మేల్కొన్నాడు. మంచంపై ఉన్న పామును చూసి భయపడి గది నుండి బయటకు పరుగులు పెట్టాడు. అనంతరం పాము పట్టే వారికి సమాచారం అందించగా వారు దానిని పట్టుకున్నారు. అదృష్టవశాత్తూ పాము అతన్ని కాటేయలేదు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News