రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్(కోబ్రా)లో పనిచేసే ఇన్‌స్పెక్టర్ ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. చింతగుఫ పోలీసు స్టేషన్ పరిధిలోని కోబ్రా 206 కంపెనీకి చెందిన బుర్కపల్ క్యాంప్‌లోని టాయిలెట్‌లో ఇన్‌స్పెక్టర్ వలంగ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సుక్మా ఎస్‌పి సునీల్ శర్మ తెలిపారు. నాగాలాండ్‌కు చెందిన వలంగ్ గురువారం రాత్రి 8.50 ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన చెప్పారు. వెంటనే ఆయనను చితల్నర్ ఫీల్డ్ ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే మరణించినట్లు సిఆర్‌పిఎఫ్ డాక్టర్లు నిర్ధారించారని ఎస్‌పి తెలిపారు. డిసెంబర్ 7వ తేదీన సిఆర్‌పిఎఫ్ 37వ బెటాలియన్‌కు చెందిన 206 కోబ్రా కంపెనీకి వలంగ్ బదిలీ అయ్యారని ఆయన చెప్పారు. సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ప్రత్యేక పోరాట విభాగమైన కోబ్రాను వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఛత్తీస్‌గఢ్‌లో కోబ్రా ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -