Thursday, January 16, 2025

ఆగస్ట్ 11న ‘కోబ్రా’

- Advertisement -
- Advertisement -

Cobra movie released on August 11

ప్రయోగాత్మక చిత్రాలతో అనేక సూపర్‌హిట్‌లు, బ్లాక్‌బస్టర్‌లను సొంతం చేసుకున్న చియాన్ విక్రమ్ అసాధారణ సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు ద ర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగా ణ రాష్ట్రాల ‘కోబ్రా’ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నా రు. ఆగస్ట్ 11న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భా షల్లో ఏకకాలంలో విడుదల కానుంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రంలో విక్రమ్ గణిత శాస్త్ర మేధావి పా త్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించడం విశేషం. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమా ర్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విక్రమ్
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ శుక్రవారం మధ్యా హ్నం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన ఆయనను చెన్నై కావేరీ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్న ట్టు సమాచారం. ఛాతీలో ఇబ్బందిగా అనిపించడంతో వి క్రమ్‌ను ఆసుపత్రిలో చేర్పించామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నిజానికి ఆయనకి గుండె పోటు రాలేదని, హైఫీవర్ తో బాధపడుతున్నారని అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినీ క్రిటిక్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు. కావేరీ ఆసుపత్రిలో విక్రమ్ చికిత్స తీసుకుంటున్నారని.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల కరోనా బారినపడిన విక్రమ్.. కోలుకుని ప్రస్తుతం షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News