Monday, December 23, 2024

అదరగొట్టే యాక్షన్ ఎపిసోడ్స్

- Advertisement -
- Advertisement -

Cobra Movie to Release on Aug 31

చియాన్ విక్రమ్ కధానాయకుడిగా ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ‘కోబ్రా’ టీజర్ విడుదలైంది. రెండు నిమిషాల నిడివిగల ఈ టీజర్ అధ్యంతం ఆకట్టుకుంది. ప్రతి సమస్యను గణితంతో పరిష్కరించే మేధావి పాత్రలో బ్రిలియంట్ ఎంట్రీ ఇచ్చిన విక్రమ్ తన పర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకులని కట్టిపడేశారు. అసాధ్యమైన కేసులని తన గణిత మేధతో పరిష్కరించే విక్రమ్‌కు ఇర్ఫాన్ పఠాన్ పాత్ర రూపంలో సవాల్ ఎదురుకావడం, తర్వాత వచ్చిన హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ మునుపెన్నడూ చూడని థ్రిల్‌నిచ్చాయి. ఇక టీజర్ చివరలో విక్రమ్‌ని తలకిందులుగా వేలాడదీసి ‘నువ్వేనా లెక్కల మాస్టర్ వి’ అని తీవ్రంగా కొడుతుంటే.. ఆయన తనదైన శైలిలో నవ్వడం.. కోబ్రా కథపై మరింత ఆసక్తిని పెంచింది. యాక్షన్ ఎపిసోడ్స్ ని అద్భుతంగా చూపించారు. ఏఆర్ రెహమాన్ టీజర్‌కు అందించిన నేపధ్య సంగీతం అవుట్ స్టాండింగ్‌గా వుంది. ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించడంతో పాటు మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్వీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ‘కోబ్రా’ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నారు.

Cobra Movie to Release on Aug 31

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News