Thursday, January 23, 2025

నటవిశ్వరూపం చూపించే విక్రమ్

- Advertisement -
- Advertisement -

Cobra Movie Unit Press Meet in Hyderabad

చియాన్ విక్రమ్ కథానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’ ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్.ఎస్. లలిత్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విక్రమ్, శ్రీనిధి, మీనాక్షి, మృణాళిని రవి, నిర్మాత ఎన్వీ ప్రసాద్ పాల్గొని చిత్ర విశేషాలను తెలియజేశారు. ఈ సమావేశంలో విక్రమ్ మాట్లాడుతూ… తెలుగు ప్రేక్షకులకులతో నాకు గొప్ప అనుబంధం వుంది. నేను నటనకు ఆస్కారం వుండే పాత్రలు, సినిమాలు చేసినప్పుడల్లా గొప్పగా ఆదరిస్తారు. కోబ్రాలో కూడా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ కథ నాకు చాలా నచ్చింది. కథ విన్న వెంటనే సినిమా చేసేయాలనిపించింది. సినిమా మొదలుపెట్టిన తర్వాత కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. అయితే అవన్నీ దాటుకుంటూ సినిమాని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం. రష్యాలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో సినిమాను చిత్రీకరీంచినపుడు సహాయ దర్శకులు రక్తం కూడా వచ్చింది. అక్కడ చాలా కష్టపడి చేశాం. ఒకొక్క పాత్రకి మేకప్ వేయడానికి సుమారు ఐదు గంటల సమయం పట్టేది.

అయితే దిన్ని ఎంజాయ్ చేశాను. ప్రతి పాత్రకి ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, మేనరిజం ఉంటుంది. కోబ్రా సైకాలాజికల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, ఎమోషనల్ డ్రామా. హై ఆక్టేవ్ యాక్షన్, టెక్నికల్‌గా వున్నంతంగా వున్న సినిమా ఇది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ శ్రీనిధి, మీనాక్షి, మృణాళిని. వారు చక్కగా తెలుగులో మాట్లాడారు. కొబ్రాలో శ్రీనిధి, నాకు మంచి రొమాంటిక్ బాండింగ్ వుంటుంది. దర్శకుడు అజయ్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. మీనాక్షి కాలేజీ అమ్మాయిగా కనిపిస్తుంది. మృణాళిని పాత్ర ఎమోషనల్ గా వుంటుంది. కోబ్రా బయటికి ఒక హాలీవుడ్ మూవీలా కనిపిస్తున్నా లోపల ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ ఇలా చాలా ఎలిమెంట్స్ వున్నాయి. రోషన్ అండ్రూ విలన్‌గా కనిపిస్తారు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు మొదటి సినిమా ఇది. ఆయన సెట్స్‌కి వచ్చినపుడు నటన గురించి పెద్దగా తెలీదు. కానీ దర్శకుడు అజయ్ ట్రైన్ చేసి ఒక ప్రొఫెషనల్ నటుడిగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతి ఇవ్వాలని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. కోబ్రా ఒక యూనివర్సల్ సబ్జెక్ట్. ఇంత మంచి సినిమాని తెలుగులో తిరుపతి ప్రసాద్ గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు. కోబ్రాలో నాకు తొమ్మిది విభిన్నమైన పాత్రలు వచ్చాయి. ఇదీ చాలా ఆసక్తికరమైర కథ. ఇందులో లెక్కల మాస్టారిగా చేశాను. కోబ్రా ఎప్పుడు కాటేస్తుందో తెలీదు, అలాగే తన చర్మాన్ని కూడా మార్చుకోగలదు. ఇందులో నా పాత్ర అలానే వుంటుంది. ప్రతి పాత్రలో విభిన్నమైన ఫెర్ఫార్మెన్స్ వుంటుంది.

నా కెరీర్ లో చాలా సవాల్ గా అనిపించిన సినిమా కోబ్రా. ఎన్వీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ… కమల్ హసన్ తర్వాత నటన విశ్వరూపం చూపించే నటుడు విక్రమ్. విభిన్నమైన పాత్రలలో విభిన్నమైన గెటప్స్‌లో అలరించడం విక్రమ్ గారి లాంటి కొద్దిమంది నటులకే సాధ్యపడుతుంది. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ చిత్రాలలో విక్రమ్ తన నట విశ్వరూపం చూపించారు. కోబ్రా కూడా భారీ స్థాయి సినిమా. ఈ సినిమా కోసం రష్యాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. ఏఆర్ రెహ్మాన్ లాంటి అత్యున్నత సాంకేతక నిపుణులు ఈ సినిమా కోసం పని చేశారు. రష్యాతో పాటు కలకత్తా, చెన్నై, అలిపి ఇలా విభిన్నమైన ప్రాంతాల్లో ఈ సినిమాని చిత్రీకరించారు. ఈనెల 31న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘కోబ్రా’ విక్రమ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది” అని అన్నారు. శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ… విక్రమ్‌తో నటించడం గౌరవంగా భావిస్తున్నా. థియేటర్‌లో చూడాల్సిన సినిమా ఇది” పేర్కొన్నారు.

Cobra Movie Unit Press Meet in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News