Thursday, January 9, 2025

పెట్ బాటిళ్లతో జాతీయ జెండాలను ప్రవేశపెట్టిన కోకా-కోలా ఇండియా, ఐసిసి

- Advertisement -
- Advertisement -

న్యూదిల్లీ: ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ప్రారంభం కానున్నందున, కోకా-కోలా ఇండియా, ఐసిసి క్రికెట్ పట్ల దేశం ఉత్సాహాన్ని సుస్థిరతకు నిబద్ధతతో ఒకచోట చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ ప్రారంభోత్సవం సందర్భంగా, కోకా-కోలా ఇండియా, ఐసీసీ కలసి వినియోగించిన పెట్ బాటిళ్లతో తయారు చేసిన జాతీయ జెండాలను ప్రవేశపెట్టాయి. ఈ పెట్ బాటిల్స్ నూలును ఉత్పత్తి చేయడానికి రీసైకిల్ చేయబడ్డాయి, తరువాత వాటిని జెండాల కోసం ఉపయోగించారు. ఈ జెండాలు స్టేడియంలలో ప్రతి మ్యాచ్ జరిగే ముందు ‘జాతీయ గీతం వేడుక’లో ఉపయో గించబడతాయి.

పర్యావరణ బాధ్యత కొత్త శకాన్ని తెలియజేస్తూ, కోకా-కోలా ఇండియా ఈ టోర్నమెంట్ లో ఆడే పది దేశాల జాతీయ జెండాలను, పది ఐసీసీ యూనిటీ జెండాలను రూపొందించడానికి వీలు కల్పించింది. ఇది కోకా-కోలా ఇండియాను క్రికెట్ క్రీడలో రీసైకిల్ చేసిన పెట్ జాతీయ జెండాలను ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే మొదటి కంపెనీగా చేసింది. ఇది భవిష్యత్ ఈవెంట్‌లకు ఒక ఉదాహరణగా నిలిచింది.

జాతీయ జెండాను రూపొందించడానికి సుమారు 11,000 పెట్ బాటిల్స్ ఉపయోగించబడ్డాయి. ఐసీసీ యూనిటీ ఫ్లాగ్‌ను రూపొందించడానికి సుమారు 2000 సీసాలు ఉపయోగించబడ్డాయి. రీసైకిల్ చేసిన నూలు, వస్త్రాల తయారీలో నిమగ్నమై ఉన్న గణేశా ఎకోవర్స్ లిమిటెడ్ ద్వారా ఈ జెండాలు తయారు చేయబడ్డాయి. ఈ అద్భు తమైన జెండాలకు జీవం పోయడానికి 100 మంది కార్మికులు 25 రోజులు, 300 గంటలకు పైగా సమయాన్ని వెచ్చించారు.

ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ఇండియా 2023కి థమ్స్ అప్, లిమ్కా స్పోర్ట్జ్ అధికారిక బేవరేజ్ అండ్ స్పో ర్ట్స్ డ్రింక్ భాగస్వాములుగా ఉన్నాయి. ఇండియా ప్రపంచ కప్ సందర్భంగా వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవ గాహన కల్పించేందుకు కోకా-కోలా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లో అభిమానులు, వినియోగదారులను ఈ విషయంలో నిమగ్నం చేయడంతో సహా అనేక కార్యక్రమాలను చేపడుతోంది.

కోకా-కోలా ఇండియా & సౌత్ వెస్ట్ ఆసియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అర్నాబ్ రాయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..  ‘‘కోకా-కోలా అన్ని క్రీడా ఈవెంట్‌లలో అంతర్భాగంగా సుస్థిరదాయకత ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో ఉంది. ఈ ఆశయానికి అనుగుణంగా, ఈ రోజు ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023లో రీసైకిల్ చేసిన పెట్ తో తయారుచేసిన జాతీయ జెండాలను ఆవిష్కరించడం పట్ల మేం గర్విస్తున్నాం. ఈ రీసైకిల్ చేసిన జాతీయ, ఐసీసీ యూనిటీ జెండాలతో మేం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ సూత్రాలను ముందుకు తీసుకెళ్లడానికి అంకిత భావంతో ఉన్నాం’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News