Thursday, January 23, 2025

‘హానెస్ట్ టీ’ ఐస్‌డ్ గ్రీన్ టీని ఆవిష్కరించిన కోకా-కోలా ఇండియా

- Advertisement -
- Advertisement -

వినియోగదారులకు విస్తృతమైన పానీయాల ఎంపికలను అందించే ప్రయత్నంలో కోకా-కోలా ఇండియా కోకా-కోలా కంపెనీ అనుబంధ సంస్థ అయిన హానెస్ట్ ఇన్ కార్పొరేషన్ యాజమాన్యంలోని బ్రాండ్ హానెస్ట్ టీని ఆవిష్కరించడం ద్వారా రెడీ –టు- డ్రింక్ టీ బేవరేజెస్ ప్రపంచంలోకి ప్రవేశించింది. హానెస్ట్ టీ అనేది రిఫ్రెషింగ్, ఆర్గానిక్ గ్రీన్ టీ ఆధారిత పానీయం. హానెస్ట్ టీ కోసం ఆర్గానిక్ గ్రీన్ టీ ప్రత్యేకంగా లక్ష్మీ టీ ప్రఖ్యా త మకైబారి టీ ఎస్టేట్ నుండి తీసుకోబడింది.

హిమాలయాల దిగువన ఉన్న ఏటవాలు ప్రాంతాలలో ఉన్న మకైబారి బాగా పాతకాలం నాటి ఆర్గానిక్ డా ర్జిలింగ్ టీ తోట. మకైబరిలో బయోడైనమిక్ వ్యవసాయ వాతావరణంలో తేయాకు చాలా జాగ్రత్తగా ఎంపిక చేయబడుతుంది, ఇది అరుదైన చంద్రకాంతిలో తీసిన తేయాకుకు ప్రసిద్ధి చెందింది.

“డార్జిలింగ్‌లో మకైబారి కంటే గొప్ప టీ ఎస్టేట్ లేదు, జపాన్‌లో లేదా ఇంగ్లండ్‌లో రాయల్‌ హౌస్‌లలోని టీ లలో ఇదే అత్యుత్తమం” అని కోల్‌కతాకు చెందిన లక్ష్మీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రుద్ర ఛటర్జీ అన్నారు. “ఇది సత్యజిత్ రే తన కల్పిత డిటెక్టివ్ పాత్ర అయిన ఫెలూడా కోసం నిర్ణయించుకున్న టీ ఎంపిక కూడా” అని అన్నారు.

కోకా-కోలా ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఏషియా మార్కెటింగ్ – హైడ్రేషన్, కాఫీ, టీ కేటగిరీ డైరెక్టర్ కార్తీక్ సుబ్రమణియన్ ఈ ఆవిష్కరణ గురించి మాట్లాడుతూ..‘మా కొత్త రెడీ-టు డ్రింక్ ఐస్‌డ్ గ్రీన్ టీని పరి చయం చేయడం పట్ల మేం సంతోషిస్తున్నాం. హానెస్ట్ టీతో, మేం వినియోగదారులకు అద్భుతమైన గ్రీన్ టీ ఆధారిత పానీయం ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తున్నాం. ఎవరైనా ప్రయాణంలో ఉన్నా లేదా ప్రశాంత త కోసం వెతుకుతున్నా, ‘హానెస్ట్ టీ’ అనేది రిఫ్రెష్‌మెంట్, మంచితనాన్ని అందించే పరిపూర్ణ నేస్తం’’ అని అన్నారు.

వినియోగదారుల విభిన్న అభిరుచులకు సరిపోయేలా హానెస్ట్ టీ లెమన్-తులసి, మ్యాంగో అనే రెండు రిఫ్రెష్ రుచులలో వస్తుంది. సమతుల్య జీవనశైలిని జీవించాలనుకునే నేటి ఆధునిక మహిళలు, పురుషుల కోసం ఉద్దేశించబడింది. కొత్తగా ప్రారంభించబడిన పానీయం మంచుతో కూడిన గ్రీన్ టీ ప్రతి సి ప్‌తో ‘మంచి మూమెంట్’ని అందిస్తుంది. ప్రకృతికి అనుగుణంగా పెరిగిన సేంద్రీయ గ్రీన్ టీ నుండి తయారు చేయబడిన, హానెస్ట్ టీ చాలా రుచిగా ఉండటమే కాకుండా అత్యుత్తమ నాణ్యత గల తేయాకులతో తయారు చేయబడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News