Thursday, January 23, 2025

కిన్లే బాటిల్స్‌ ను విడుదల చేసిన కోకా-కోలా ఇండియా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కోకాకోలా ఇండియా ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో 100% రీసైకిల్ పెట్ ప్లాస్టిక్ మెటీ రియల్ (rPET)తో తయారు చేసిన కొత్త బాటిళ్లను విడుదల చేసింది. 100% rPETతో తయారు చేయబడిన ఏదైనా బాటిల్‌ను ఆహారం/పానీయాల కోసం ఉపయోగించడం భారతదేశంలో ఇదే మొదటిసారి.

‘వ్యర్థాలు లేని ప్రపంచం’ని సృష్టించే తన ప్రపంచ నిబద్ధతకు అనుగుణంగా, 2030 నాటికి తన ప్యాకేజింగ్‌ లో కనీసం 50% రీసైకిల్ కంటెంట్‌ను ఉపయోగించాలనే లక్ష్యంతో కంపెనీ ఉంది; తన ప్యాకేజింగ్‌లో మరింత రీసైకిల్ చేసిన కంటెంట్‌ని ఉపయోగించేందుకు కృషి చేస్తోంది. సంస్థ ఈ లక్ష్యం కోసం సంవత్సరాలుగా కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తన విలువ గొలుసు అంతటా వర్జిన్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో స్థిరమైన పురోగతిని సాధించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ప్యాకేజింగ్‌లో 90% రీసైకిల్ చేయదగినది అయితే 15% PET రీసైకిల్ చేయబడింది (rPET).

rPET బాటిల్స్ ఫుడ్ గ్రేడ్ రీసైకిల్డ్ పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (PET) నుండి తయారు చేయబడ్డాయి. PET బాటి ళ్లను రీసైకిల్ చేసినప్పుడు, ఫుడ్ గ్రేడ్ రీసైకిల్ మెటీరియల్ కోసం USFDA, యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథా రిటీ (EFSA) ఆమోదించిన సాంకేతికతల ప్రకారం ప్లాస్టిక్ రీసైకిల్ చేయబడుతుంది. PET బాటిల్స్ ఉత్పత్తి కి వర్జిన్ ప్లాస్టిక్ అవసరాన్ని తగ్గిస్తుంది. rPET బాటిల్స్ వాడకం సహజ వనరులను సంరక్షించడమే కాకుం డా పెద్ద పర్యావరణ వ్యవస్థలో చేరే ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది.

కొత్త rPET ప్యాకేజింగ్ కంపెనీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్, కిన్లే కోసం 1-లీటర్ బాటిళ్లలో అందుబాటులో ఉంది. కొత్త బాటిల్‌ 100% రీసైకిల్ చేసిన ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడిందనే ప్రత్యేకమైన లేబుల్‌ దానిపై ఉంటుంది. ఇది భారతదేశంలో కోకా-కోలా తన వర్తులాకార ఆర్థిక వ్యవస్థ ప్రయత్నాలను నిజం చేయడంలో ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఫుడ్ సేఫ్టీని క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత, ఆహార ప్యాకేజింగ్‌లో రీసైకిల్ చేసిన పిఇటిని ఉపయోగించ డాన్ని ఆమోదించిన తర్వాత మాత్రమే ఇది సాధ్యమైంది.

కోకా-కోలా ఇండియా, సౌత్ వెస్ట్ ఆసియా టెక్నికల్ అండ్ ఇన్నోవేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్రిక్ అకెర్‌ మాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘వ్యర్థాలు లేని ప్రపంచాన్ని సృష్టించాలనే మా దృక్పథానికి అనుగుణంగా, మా పర్యావరణ ముద్రను తగ్గించడానికి, వర్తులాకార ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి మేం నిరంతరం మార్గాలను అన్వేషిస్తున్నాం. 100% రీసైకిల్ చేయబడిన PET నుండి తయారు చేయబడిన కిన్లే బాటిళ్లను ప్రారంభించడం ద్వారా, మా వినియోగదారులకు సుస్థిరదాయకమైన ప్యాకేజింగ్‌ను అందించే భారతదేశ మొట్ట మొదటి పానీయాల కంపెనీగా మేం గర్విస్తున్నాం. ఫుడ్-గ్రేడ్ rPETతో తయారు చేయబడిన మా కొత్త బాటిల్స్ వాటి ప్రారంభ వినియోగానికి మించిన విలువను కలిగి ఉంటాయి, ఎందుకంటే అవి పూర్తిగా రీసైకిల్ చేయబడుతాయి, కొత్త బాటిళ్లలో పునర్నిర్మించబడతాయి. ఇది భారత ప్రభుత్వ ‘స్వచ్ఛ భారత్ మిషన్’కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మా వంతు ప్రయత్నం’’ అని అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లోని కోకా-కోలా ఫ్రాంచైజ్ బాట్లింగ్ పార్టనర్ అయిన శ్రీ సర్వరాయ షుగర్స్ లిమి టెడ్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ బిపిపి రాంమోహన్ మాట్లాడుతూ, ‘‘ప్యాకేజింగ్‌లో రీసైకిల్ పిఇటిని ఉప యోగించడం కోసం ఈ చర్య తీసుకోవడం, సుస్థిరమైన ప్లాస్టిక్ వాడకంపై మన ప్రభుత్వ దృక్పథానికి అను గుణంగా ఉంది. ఈ సుస్థిరత కార్యక్రమంలో మొదటి చేరిన వాటిలో ఒకటిగా భారతదేశంలోని కోకా-కోలా సిస్టమ్‌తో అనుబంధం కలిగిఉన్నందుకు మేం గర్విస్తున్నాం’’ అని అన్నారు.

కోకా-కోలా PET ప్రీఫార్మ్ సప్లై పార్టనర్ ఏఎల్పీఎల్ఏ ఇండియా సస్టైనబిలిటీ హెడ్ ఉత్సవ్ దీక్షిత్, మాట్లాడుతూ, “వ్యర్థాలు లేని ప్రపంచాన్ని సృష్టించే కోకా-కోలా దృక్పథానికి కార్యరూపం ఇవ్వడంతో పా టు, ఈ ఆవిష్కారం ఏఎల్పీఎల్ఏ గ్లోబల్ సస్టైనబిలిటీ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. 2018లో, ఏఎల్పీఎల్ ఏ, ఎల్లెన్ మాక్‌ఆర్థర్ ఫౌండేషన్ భాగస్వామిగా, గ్లోబల్ కమిట్‌మెంట్‌పై సంతకం చేసింది. 2025 నాటికి సగ టున 25% రీసైకిల్ కంటెంట్‌తో 100% పునర్వినియోగపరచదగిన ప్యాకేజింగ్‌ను ఉత్పత్తి చేయడం మా లక్ష్యం. ఈ ఆవిష్కారం భారతదేశంలో ఆ దిశలో ఒక పెద్ద అడుగు. మేము కోకా-కోలాతో అనుబంధాన్ని కలిగి ఉన్నందుకు గర్విస్తున్నాం. వ్యర్థాలు లేని ప్రపంచాన్ని ప్రారంభించడానికి అవసరమైన ప్రతిదాన్ని కొనసాగిస్తాం’’ అని అన్నారు.

డిసెంబర్ 2022లో, కోకా-కోలా బంగ్లాదేశ్ 100% rPET బాటిళ్లను విడుదల చేసింది. ఇది సౌత్ వెస్ట్ ఆసియా (SWA) ప్రాంతంలో 2-లీటర్ ప్యాకేజీలలో కిన్లే వాటర్ బాటిళ్లను ప్రవేశపెట్టిన మొదటి మార్కెట్‌గా నిలిచింది. కోక-కోలా కంపెనీ ఇప్పుడు 100% rPET బాటిళ్లను దాదాపు 40 కంటే ఎక్కువ మార్కెట్‌లలో అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News