Monday, December 23, 2024

లక్షల మంది రైతుల జీవితాలను స్పృశించిన కోకాకోలా ‘ప్రాజెక్ట్ ఉన్నతి’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ ఏర్పాటు దిశగా తన ప్రయత్నాలకు అనుగుణంగా కోకా-కోలా ఇండియా, దశాబ్దకాలంగా తన ప్రాజెక్ట్ ఉన్నతి యొక్క విజయవంతమైన దశాబ్ద అమలు తీరును ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కోకా-కోలా యొక్క ఫల పంపిణీ ఆర్థికస్థితి చొరవ యొక్క భాగంగా ఉంది, అది కంపెనీ యొక్క ESG ప్రాధాన్యత అయిన – సుస్థిర వ్యవసాయం యొక్క మూల స్థంభముగా ఉంది. సాగు సామర్థ్యమును పెంపొందించడం, తదుపరి అనుసంధానతలను బలోపేతం చేయడం, మరియు దేశములో ఆహార-ప్రాసెసింగ్ సామర్థ్యమును నిర్మించడం ద్వారా భారతీయ వ్యవసాయ-పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి ప్రాజెక్ట్ ఉన్నతి లక్ష్యంగా చేసుకుంది. గడచిన 10 సంవత్సరాలలో, ప్రాజెక్ట్ ఉన్నతి ఇండియాలోని 12 రాష్ట్రాల వ్యాప్తంగా సుమారు 350,000 లక్షల మంది పళ్ళ రైతులకు సాధికారత కల్పించి సహాయపడేందుకు దోహదపడింది. ఐదు పండ్ల రకాలు మామిడి, ఆపిల్, ఆరంజ్, ద్రాక్ష, లిచీ మరియు చెరకు పంటలపై దృష్టి సారిస్తూ, ఈ కార్యక్రమం పళ్ళతోటల సరఫరా-గొలుసును పెంపొందించడం మరియు దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పాదనను వృద్ధి చేయడాన్ని లక్ష్యంగా చేసుకొంది.

తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నతి ప్రాజెక్టుల ద్వారా మంచి వ్యవసాయ పద్ధతులను(GAP) అనుసరించడంతో అత్యంత అధిక సాంద్రత పళ్ళ మొక్కల పెంపకపు సాంకేతిక పరిజ్ఞానము ద్వారా 5 రెట్ల పళ్ళ ఉత్పాదకత పెంపొందగలిగింది. అంతేకాకుండా పైపెచ్చుగా, కోకా-కోలా యొక్క ‘మీఠా సోనా ఉన్నతి’ కార్యక్రమం చిన్న-తరహా చెరకు రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళను ప్రస్తావించడానికి, వారి జీవనోపాధులను పెంపొందించడానికి మరియు వాతావరణ పరిస్థితులకు తట్టుకునే చెరకు సాగును ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది.

ఈ ప్రాజెక్టులు డ్రిప్ ఇరిగేషన్, అక్కడికక్కడే శిక్షణ మరియు వ్యవసాయ అనుబంధ మద్దతు ఇమిడియున్న అధిక దిగుబడినిచ్చే మొక్కల పంపకం మరియు అత్యంత అధిక సాంద్రత పళ్ళ మొక్కల పెంపకము (UHDP) వంటి మంచి వ్యవసాయ పద్ధతుల(GAPS) ద్వారా సానుకూల మౌలిక వసతులకు రైతుల యొక్క ప్రాప్యతను కూడా సానుకూలపరుస్తున్నాయి. ఈ కొత్త టెక్నాలజీలు ఒక యూనిట్ భూమికి గాను నాణ్యత, ఉత్పాదకత, మరియు లాభదాయకతలో ఒక గణనీయమైన పెంపుదలకు దారి తీస్తున్నాయి, అవి తదుపరిగా పళ్ళతోటల సాగును మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయి.

కోకా-కోలా కంపెనీ ఇండియా మరియు సౌత్ వెస్ట్ ఆసియా (INSWA) కొరకు సిఎస్ఆర్ మరియు సుస్థిరత అంశాల డైరెక్టర్ రాజేష్ ఆయపిళ్ళా గారు మాట్లాడుతూ, “భారతీయ వ్యవసాయాధారిత ఆర్థిక స్థితికి రైతులు వెన్నెముక వంటి వారు. ప్రాజెక్ట్ ఉన్నతి ద్వారా, ఈ రైతులకు అధునాతన పళ్ళతోటల సాగు పద్ధతులకు వీలు కల్పించడం ద్వారా వారి జీవనోపాధుల్ని వృద్ధి చేయడం మరియు పెంపొందించడం మాత్రమే కాకుండా వారి ఆదాయాలు గణనీయంగా పెంచుకునేలా వారికి సాధికారత కల్పించడం మా లక్ష్యంగా ఉంటోంది. వ్యవసాయాధారిత ఆర్థిక స్థితిని స్వయం-సమృద్ధం చేస్తూ, ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణ దిశగా భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఇది ఒక ముందడుగు” అన్నారు.

ఇండియాలో ఫల ఆవృత ఆర్థికస్థితిని సృష్టించే దిశగా కోకా-కోలా ఇండియా, ఆంధ్రప్రదేశ్ లో ‘ప్రాజెక్ట్ ఉన్నతి మ్యాంగో’ తో 2011 లో మొట్టమొదటి అడుగు వేసింది. ఆ తర్వాత ఈ కార్యక్రమం 2018 లో మహారాష్ట్రలో ‘ఉన్నతి ఆరంజ్’ కు పొడిగించబడింది, ఆ తదుపరి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము మరియు కాశ్మీర్ లో ఉన్నతి ఆపిల్ కి మరియు తదనంతరం దశాబ్దకాలంగా లిచీ మరియు ద్రాక్షకు పొడిగించబడింది. ఈ చొరవ భారతదేశ రాష్ట్రాల ప్రభుత్వాలచే విస్తృతమైన ప్రశంసలు పొందింది.

భారతదేశ ఆర్థిక ఎదుగుదలకు ప్రేరణ కలిగించడానికి మరియు రైతులు మరియు స్థానిక సరఫరాదారులకు కొత్త అవకాశాలను ఏర్పరచడానికి ప్రాజెక్ట్ ఉన్నతి లక్ష్యంగా చేసుకొంది. మహిళా సాధికారత, సామాజిక సంక్షేమము, మరియు నీటి సారధ్యంతో సహా ఇది సుస్థిరత్వ దృష్టి సారింపు అంశాల వ్యాప్తంగా సానుకూల ప్రభావాన్ని కూడా ఏర్పరుస్తుంది. ముఖ్యమైన పళ్ళ ఉత్పాదనా సరుకులకు ప్రత్యామ్నాయాలను దిగుమతి చేసుకోవడానికి మరియు వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా అవలంబించడానికి గాను రైతులు వలసల నుండి తిరిగి తమ గ్రామాలకు వెనక్కి రావాలనే భవిష్యత్ దార్శనికతను ఈ ప్రాజెక్టు లక్ష్యంగా చేసుకుంటుంది.

ప్రాజెక్ట్ ఉన్నతి క్రింద పారంభించబడిన ప్రాజెక్టులు

● ఉన్నతి మ్యాంగో

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక వ్యాప్తంగా మామిడి సాగు యొక్క సంభావ్యతను గ్రహించడానికి గాను ఉన్నతి మ్యాంగో 2011 లో చిత్తూరు జిల్లాలో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం అత్యంత అధిక సాంద్రత గల పళ్ళ మొక్కల పెంపకము, నీటి ఎద్దడిని తగ్గించడానికి డ్రిప్-ఇరిగేషన్ వాడకము, పంట దిగుబడులు పెంచడం మరియు సమగ్ర కమ్యూనిటీ అభివృద్ధి ద్వారా రైతులకు ప్రయోజనాలు కలిగిస్తోంది.
ఈ కార్యక్రమ అమలు, రైతులకు శిక్షణ, ప్రభావ విశ్లేషణ మరియు హైడ్రొలాజికల్ విశ్లేషణకు గాను జైన్ ఇరిగేషన్ మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC) సమగ్ర భాగస్వామ్య సంస్థలుగా ఉన్నాయి.

● ఉన్నతి ఆరంజ్

2018 లో ప్రారంభించబడిన ఆరంజ్ ఉన్నతి అనేది, CCIPL, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము మరియు జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ మధ్య ఒక త్రైపాక్షిక భాగస్వామ్యం యొక్క ఫలితము. సమీకృత వ్యవసాయ అభివృద్ధి పథకము నిమ్మజాతి పళ్ళ సాగు కొరకు ఉపయోగించబడే ఒక యూనిట్ భూమికి గాను నాణ్యత, ఉత్పాదకత మరియు లాభదాయకతను పెంపొందించడానికి లక్ష్యం చేసుకొంది.
సాంప్రదాయక మాండరిన్ (నాగపూర్ సంత్రా) రకాల కంటే దాదాపుగా 50% అధిక పళ్ళరసము కలిగి ఉండే సరికొత్త అంతర్జాతీయ రకాల సాగును ఉన్నతి ఆరంజ్ ప్రోత్సహిస్తుంది. ఒక సంపూర్ణమైన ప్రభావం కలిగించడానికి గాను, పరిజ్ఞాన వ్యాప్తి, నారు మొక్కల యొక్క సులభమైన లభ్యత మరియు ప్రదర్శనా క్షేత్రాల ద్వారా ప్రదర్శిత ప్రభావంపై కూడా ఈ ప్రాజెక్టు గట్టి కృషి చేస్తుంది.

● ఉన్నతి ఆపిల్

మెరుగైన మరియు అధునాతనమైన వ్యవసాయ పద్ధతులను అందించడం మరియు వాటి పట్ల అవగాహన కలిపించడం ద్వారా రైతుల జీవనోపాదుల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకొని ఈ ప్రాజెక్టు 2018 లో ప్రారంభించబడింది. నారుమొక్కల ప్రణాళికా రచనలో వారికి మద్దతు ఇవ్వడం మరియు దాదాపు 80% వరకూ రాయితీ కల్పించబడిన ఆవశ్యక మౌలిక సదుపాయాలను అందించడానికి కూడా ఈ చొరవ ప్రారంభించబడింది.
రైతు సమాజాల యొక్క సంక్షేమమును చూసుకోవడానికి, దిగుబడులు మెరుగు పరచడానికి మరియు సహజ వనరుల న్యాయబద్ధమైన వాడకమును ప్రోత్సహించడానికి గాను, కోకా-కోలా ఇండియా, ఉత్తరాఖండ్ లో ఆపిల్-ఉన్నతి ప్రాజెక్టును అమలు చేయు భాగస్వామిగా ఇండో-డచ్ హార్టికల్చర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (IDHT)తో భాగస్వామ్యం కుదుర్చుకొంది.
ఇండియాలో, ప్రత్యేకించి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్ లో ప్రధానంగా అత్యంత అధిక సాంద్రత గల పళ్ళ మొక్కల పెంపకము (UHDP) పై దృష్టి సారిస్తూ ప్రపంచ ఉత్తమ పద్ధతులను తీసుకురావడం ద్వారా ఆపిల్ ఉత్పత్తిని పెంచడం, ఒక యూనిట్ భూమికి గాను నాణ్యత, ఉత్పాదకత మరియు లాభదాయకతలో గణనీయమైన పెరుగుదల తీసుకురావడం, తద్వారా రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచడమే ఆపిల్ ఉన్నతి ప్రాజెక్టు లక్ష్యంగా చేసుకొంది. ఆపిల్ ఉత్పత్తిలో ఇండియా స్వయం-సమృద్ధిని సాధించడానికి సహాయపడటంలో కూడా ఇది ఒక ఉత్ప్రేరకముగా పని చేస్తోంది.

● ఉన్నతి ద్రాక్ష

2019 లో ప్రారంభించబడిన సమీకృత వ్యవసాయ అభివృద్ధి పథకము సాగు కొరకు ఉపయోగించబడే ఒక యూనిట్ భూమికి గాను నాణ్యత, ఉత్పాదకత మరియు లాభదాయకతను పెంపొందించడానికి లక్ష్యం చేసుకొంది.
ఈ ప్రాజెక్టు కొరకు అమలుచేయు భాగస్వామిగా PayAgri, NRC-గ్రేప్స్, మరియు సెన్‌డెక్ట్ (Cendect)-KVK ఉన్నారు.
తమిళనాడు లోని థేని మరియు దిండుగల్ జిల్లాల వ్యాప్తంగా 8000 మంది రైతులకు మించి శిక్షణ ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు లక్ష్యముగా చేసుకొంది

● ఉన్నతి లిచీ

ఈ కార్యక్రమాన్ని, దేహాత్, లిచీపై జాతీయ పరిశోధనా కేంద్రము (NRCL) మరియు కేడియా ఫ్రెష్ తో 2019 లో మొదలుపెట్టడం జరిగింది. వ్యవసాయ-విలువ చైన్ సామర్థ్యము అదేవిధంగా లిచీ సాగులో రైతుల సమర్థతను పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన చొరవగా ఉంది.
ఈ కార్యక్రమం మంచి వ్యవసాయ పద్ధతుల (GAP)పై రైతులకు శిక్షణ అందిస్తుంది మరియు సముచితమైన టెక్నాలజీ చర్యల ద్వారా ప్రదర్శనా ఉద్యానవనాల ఏర్పాటును కల్పిస్తుంది.

Coca-Cola india project unnati touched 3 lakh plus farmers lives

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News