Sunday, December 22, 2024

డిచ్‌పల్లిలో కొకైన్ కలకలం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పట్టివేత, ఇద్దరు అరెస్టు
మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో : హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోనే చలామణి అయ్యే డ్రగ్స్ నిజామాబాద్ జిల్లాలో పట్టుబడడం కలక లం రేపింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న డ్రగ్స్ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం మేరకు వల పన్ని పట్టుకున్నా రు. టాస్క్‌ఫోర్స్ ఎసిపి రాజశేఖర్ కథనం మేరకు.. కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఎసిపి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఆదివారం రాత్రి డిచ్‌పల్లి మండలం, నడిపల్లి జాతీయ రహదారి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న స్కోడా కారును సోదా చేయగా వారి వద్ద 12.3 గ్రాముల కొకైన్, మూడు గ్రాముల ఎండిఎంఎతో పాటు 3.8 గ్రాముల గంజాయి పౌడర్ లభ్యమయ్యాయి. కారులో ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా హైదరాబాద్‌కు చెందిన విక్రమ్ రెడ్డి, గుంటూరు జిల్లా, చిలకలూరిపేటకు చెందిన సిస్టిలు స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా చేయాలనే ఆలోచనతో డ్రగ్స్ తేవడానికి కొద్ది రోజుల క్రితం కారులో ఢిల్లీ వెళ్లారు. అక్కడ కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలు కొనుగోలు చేశారు. ఒక్క గ్రాము కొకైన్‌ను 5 వేల రూపాయలకు గ్రాము ఎండిఎంఎను 12 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. వాటిని తీసుకొని ఢిల్లీ నుంచి నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్నారు. వీటిని తమతో పాటు అత్యంత సన్నిహితులను విక్రయించడానికి తరలిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని టాస్క్‌ఫోర్స్ ఎసిపి రాజశేఖర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News