- Advertisement -
సిటిబ్యూరోః జిహెచ్‌ఎంసి కార్పొరేటర్ ఇంట్లో డ్రగ్స్ దాచిపెట్టగా పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…జిహెచ్‌ఎంసి బోరబండ కార్పొరేటర్‌కు పిఏగా పనిచేస్తున్న మహ్మద్ ఇస్మాయిల్ అలియాస్ చోర్ అబ్బు ఇంట్లో కొకైన్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే నార్కోటిక్, ఎక్సైజ్ అధికారులు అబ్బు ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో దాడిచిన ఆరు గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో చొర్ అబ్బూపై ఎస్‌అర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో చోరీ కేసులు, బెట్టింగ్ కేసులు నమోదయ్యాయి. కొకైన్ దాచిన నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -