Sunday, January 19, 2025

గుజరాత్‌లో రూ.130 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్ : గుజరాత్ లోని కచ్ తీరంలో రూ.130 కోట్ల విలువైన కొకైన్‌ను పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. గాంధీధామ్ పట్టణం లోని మితిరోహార్ ప్రాంతంలో స్మగ్లర్లు సముద్ర తీరంలో మాదక ద్రవ్యాలను దాచిపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీస్‌లు తనిఖీలు చేపట్టి 13 ప్యాకెట్ల కొకైన్‌ను పట్టుకున్నారు. దీని విలువ రూ. 130 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. వీటిని తరలిస్తున్న నిందితులను అదుపు లోకి తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే ప్రాంతంలో రూ.800 కోట్ల విలువైన 80 కొకైన్ ప్యాకెట్లను పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News