Monday, December 23, 2024

రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

జమ్ము : జమ్ము కశ్మీర్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. రాంబస్ జిల్లాలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా కొకైన్‌ను సీజ్ చేశారు. మొత్తం 30 కిలోల కొకైన్ పట్టుపడగా, అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ. 300 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్ అక్రమ రవాణా వ్యవహారంలో ఇద్దరు పంజాబీలను అరెస్ట్ చేశారు.

డ్రగ్స్ ముఠా కదలికలపై నిఘా ఉంచిన పోలీస్‌లు జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారి లోని బేనీహాల్ వద్ద శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ వాహనాన్ని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా, అందులో భారీగా డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. శనివారం రాత్రి రైల్వే చౌక్ బానీహాల్ వద్ద ఓ వాహనం కశ్మీర్ నుంచి వస్తుండగా పట్టుకున్నారు. ఇది చాలా హైగ్రేడ్ కొకైన్ అని, దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.300 కోట్లు ఉంటుందని జమ్ము జోన్ ఏడీజీపీ ముకేశ్ సింగ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News